ధనిక రాష్ట్రం తెలంగాణలో కూడా ఆర్టీసీని విలీనం చేయలేకపోయారు: మంత్రి వెల్లంపల్లి

01-01-2020 Wed 20:10
  • విలీనం చేసేందుకు కావాల్సింది డబ్బు కాదు మనసు
  • ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులు పాటుపడాలి
  • విజయవాడలో ఆర్టీసీ కార్మికుల కృతజ్ఞత సభ

ఏపీ ఎస్సార్టీసీ కార్మికులు ఈరోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ఏపీదేనని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని అన్నారు. విలీనం చేసేందుకు కావాల్సింది డబ్బు కాదు మనసు అని, ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు కృషి చేయాలని సూచించారు.