చంద్రబాబు రాజకీయాలకు పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ తోడయ్యారు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

01-01-2020 Wed 19:35
  • బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ హైదరాబాద్ వెళ్లిపోతారు
  • ‘జనసేన’ కార్యాలయానికి లింగమనేని భూమి ఇచ్చారు
  • అందుకే, పవన్ ఉద్యమాలు చేస్తున్నారు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయాలకు పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ తోడయ్యారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ హైదరాబాద్ తిరిగి వెళ్లిపోతాడని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వైఖరి నచ్చకే మొన్నటి ఎన్నికల్లో ఆయన్ని రెండుచోట్ల ఓడించారని విమర్శించారు. జనసేన పార్టీ కార్యాలయానికి లింగమనేని భూమి ఇచ్చారని, ఆయన భూములకు రేట్లు పడిపోతాయనే పవన్ ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు.