Andhra Pradesh: హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై ప్రకటన: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • శాసన సభను సమావేశపరిచి వివరాలను వెల్లడిస్తాం
  • రాజధాని తయారీకి వందేళ్లు పడుతుంది
  • పది శాతం ప్రజలకే సచివాలయం, హైకోర్టులతో పని ఉంటుంది

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా లేక గ్రామమా ? అని ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. పదిశాతం మంది ప్రజలకు మాత్రమే సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉంటుందన్నారు. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. శాసనసభను సమావేశపరిచి రాజధానిపై వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.

More Telugu News