అమరావతి నుంచి రాజధానిని ఒక అంగుళం కూడా కదపలేరు: ఎంపీ కేశినేని నాని

01-01-2020 Wed 17:48
  • రాజధాని ప్రాంతాల్లో చంద్రబాబుతో కలిసి నాని పర్యటన
  • అక్కడి ప్రజల నిరసనలకు సంఘీభావం తెలిపాం
  • రాజధానిని తరలించాలని చూస్తే పోరాడతాం

ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈరోజు పర్యటించారు. ప్రభుత్వం తీరుపై నిరసన తెలుపుతున్న అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపినట్టు నాని ఓ ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన విమర్శలు చేశారు. జగన్ అండ్ ముఠా ఇక్కడి నుంచి రాజధానిని ఒక అంగుళం కూడా కదపలేరని హెచ్చరించారు. అందుకు భిన్నంగా ఏం జరిగినా చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని ప్రజలకు హామీ ఇచ్చినట్టు చెప్పారు.