నాడు చంద్రబాబుతోనూ, నేడు జగన్ తోనూ సత్సంబంధాలు ఉన్నాయి: మంత్రి కేటీఆర్

01-01-2020 Wed 16:09
  • పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉన్నాం కనుకే ‘కాళేశ్వరం’ పూర్తయింది
  • గోదావరి, కృష్ణా నదులపై ఉమ్మడి ప్రాజెక్టు పక్కన పెట్టలేదు
  • ఈ ప్రాజెక్టు పక్కన పెట్టామని సీఎంలు ప్రకటించలేదు

ఏపీ సీఎం జగన్ తో తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉన్నాం కనుకనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగామని మంత్రి కేటీఆర్ అన్నారు. చంద్రబాబు హయాంలో కూడా ఏపీతో సత్సంబంధాలు కొనసాగాయని గుర్తుచేసుకున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉమ్మడి ప్రాజెక్టును పక్కన పెట్టలేదని, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టామని రెండు రాష్ట్రాల సీఎంలు ప్రకటించలేదని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం పదవిపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ, కేసీఆరే తమ సీఎం అని, ఈ విషయమై అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టత ఇచ్చారని, దీనిపై ఇంకా అనుమానం ఎందుకు? అని ప్రశ్నించారు.