మున్సిపల్ ఎన్నికల్లో మా ప్రత్యర్థి కాంగ్రెస్సే.. ఆ పార్టీని తీసిపారేయలేము: మంత్రి కేటీఆర్

01-01-2020 Wed 15:46
  • కాంగ్రెస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది
  • ఎన్నో ఒడిదుడుకులు చూసింది
  • రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదు..ఆ విషయం వాళ్లకూ తెలుసు

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. ఎంతో చరిత్ర ఉన్న, ఎన్నో ఒడిదుడుకులు చూసిన కాంగ్రెస్ పార్టీని తీసిపారేయడానికి వీల్లేదని అన్నారు. ఒకటి, రెండు విజయాలు రాగానే తామేమీ ఎగిరిపడటం లేదన్న కేటీఆర్, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకుంటారన్న వార్తల గురించి ప్రస్తావిస్తూ అది వాళ్ల పార్టీ వ్యవహారమని చెప్పారు.

హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన ర్యాలీకి పోలీసుల అనుమతి లభించకపోవడాన్ని ప్రస్తావిస్తూ శాంతి భద్రతలను కాపాడేందుకే పర్మిషన్ ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదన్న విషయం వాళ్లకూ తెలుసని వ్యాఖ్యానించారు. నా చిన్నప్పుడు బీజేపీ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే వుందని సెటైర్ వేశారు.