నూతన సంవత్సర వేడుకల్లో.. డ్రంకెన్ డ్రైవ్ కేసులు

01-01-2020 Wed 15:22
  • పెద్ద సంఖ్యంలో నిబంధనల ఉల్లంఘనలు
  • హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 కేసుల నమోదు
  • రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో 1154 కేసులు

నూతన సంవత్సరం వేడుకల్లో మధ్యం ఏరులై పారింది. ఉత్సవాల్లో జోష్ నింపడానికి ప్రజలు భారీగా మద్యం కొనుగోళ్లకు ఎగపడ్డారు. అదేవిధంగా తాగి వాహనాలు నడిపిన వారి సంఖ్య కూడా పెరిగింది. హైదరాబాదులోని మూడు కమిషనరేట్ పరిధుల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు పెద్ద సంఖ్యలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 873 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సమాచారం.