నా భార్య భువనేశ్వరి సూచన మేరకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నాను: చంద్రబాబు

01-01-2020 Wed 14:11
  • నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నాం
  • అమరావతి కోసం అందరు దేవుళ్ల దీవెనలు తీసుకున్నాం
  • రాజధానిలో  బడుగు బలహీన వర్గాల వారే అధికంగా ఉన్నారు

అమరావతి రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో రైతుల దీక్షకు చంద్రబాబు, భువనేశ్వరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తన భార్య భువనేశ్వరి సూచన మేరకే నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని తాను కీలక నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. అమరావతి కోసం అందరు దేవుళ్ల దీవెనలు తీసుకున్నామని చెప్పారు.

రాజధానిలో బడుగు బలహీన వర్గాల వారే అధికంగా వున్నారని చంద్రబాబు అన్నారు. ప్రాణ సమానంగా తమ భూములను చూసుకున్నామని రైతులు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త సమస్యను తెరపైకి తెచ్చి వైసీపీ ప్రభుత్వం చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నామని ఈ రోజు ఉదయమే చంద్రబాబు ప్రకటించారు.