జగన్ ఆ రోజు ముద్దులు పెట్టాడు.. ఈ రోజు పిడిగుద్దులు గుద్దుతున్నాడు: చంద్రబాబు

01-01-2020 Wed 13:12
  • రాజధాని అనేది కొంతమంది కోసం కాదు
  • రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిది
  • రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలి
  • రాజధాని కోసం పోరాటాలు చేయాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టాడని, ఇప్పుడు మాత్రం తన నిర్ణయాలతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని తాను విమర్శిస్తే ఆయన పట్టించుకునేవారని, తనను చూస్తే ఆయన గౌరవించేవారని అన్నారు. కానీ, జగన్ మాత్రం అలా చేయడం లేదని, సూచనలను పట్టించుకోవట్లేదని అన్నారు.

రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రుల కల అమరావతి అని అన్నారు. ఇక్కడే రాజధాని ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.