Jagan: 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' పాటకు.. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్‌ టాక్‌.. వైరల్

  • జగన్ పై తన అభిమానాన్ని చాటుతూ వీడియో
  • హావభావాలు పలికిస్తూ చేసిన వీడియోకు అందరూ ఫిదా 
  • 16 సెకన్ల నిడివి ఉన్న వీడియో 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తన అభిమానాన్ని చాటుతూ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఓ టిక్ టాక్ వీడియో చేశారు. 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' అనే పాటకు హావభావాలు పలికిస్తూ ఆమె చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

గతంలో జగన్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఈ పాట బాగా వినపడింది. ఆ పాటను తీసుకునే పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియోను చేశారు. ఈ వీడియో 16 సెకన్ల నిడివి ఉంది. ప్రస్తుతం టిక్ టాక్ యాప్ యువతను ఎంతగా ఆకర్షిస్తోందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ను చక్కగా వినియోగించుకుని పుష్ప శ్రీవాణి జగన్ మీద చూపిన అభిమానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.

More Telugu News