Telangana: ‘భగీరథ’ నీళ్లు బాటిళ్లలో విక్రయించే నీళ్ల కంటే శుద్ధమైనవి: మంత్రి ఎర్రబెల్లి

  • సీఎం కేసీఆర్ అద్భుతమైన ఇంజినీర్
  • దేశంలో మోదీ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది
  • రాష్ట్రంలో కాంగ్రెస్ సినిమా క్లైమాక్స్ కు చేరింది

రాష్ట్రంలో అద్భుతమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి  సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని.. ఆయనొక అద్భుతమైన ఇంజనీర్‌ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నిన్న మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం ఎదళ్లగుట్ట వద్ద రూ.1,700కోట్లతో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ను ఆయన ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్‌తో కలిసి సందర్శించారు. అనంతరం తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి, మరిపెడ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు నీటిశుద్ధి జరుగుతున్న తీరును, వాటి నాణ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.45వేల కోట్ల వ్యయంతో 29,960 గ్రామాలకు సురక్షితమైన తాగునీటిని అందించటమే‌ లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారన్నారు.  జాతీయ స్థాయిలో వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్న కంపెనీల నీళ్లలో నాణ్యతలేదని.. కాని భగీరథ నీళ్లు నాణ్యంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంటూ.. నిధులు మాత్రం ఇవ్వడంలేదని విమర్శించారు. దేశంలో మోదీ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సినిమా క్లైమాక్స్ కు చేరుకుందన్నారు.

More Telugu News