Railway: స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు.. అర్ధరాత్రి నుంచి అమలు!

  • కొత్త ఏడాదిలో ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్
  • సబర్బన్, సీజన్ టికెట్లకు పెంపు వర్తించదు 
  • కిలోమీటర్ కు పైసా నుంచి నాలుగు పైసల వరకు పెంపు

కొత్త ఏడాదిలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇవ్వనుంది. రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచింది. పెంచిన ఛార్జీలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పెరిగిన ఛార్జీలు సబర్బన్ ప్రాంతానికి, సీజన్ టికెట్లకు వర్తించవని తెలిపింది.

ఆర్డినరీ నాన్-ఏసీ (నాన్- సబర్బన్)లో ఫస్ట్  క్లాస్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ ల కు కిలోమీటర్ కు ఒక పైసా చొప్పున, మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ (నాన్-ఏసీ)లో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లకు కిలోమీటర్ కు రెండు పైసల చొప్పున పెంచింది. ఏసీ క్లాసెస్ కు సంబంధించి.. ఏసీ చైర్ కార్, ఏసీ-3 టైర్/ 3-టైర్ ఎకానమీ, ఏసీ-2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ చైర్ లకు నాలుగు పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

More Telugu News