Hero: హెచ్ఎఫ్ డీలక్స్ బైకును బీఎస్-6 ప్రమాణాలతో ముస్తాబు చేసిన హీరో

  • భారత్ లో బీఎస్-6 అమలుకు సమీపిస్తున్న గడువు 
  • రెండు వేరియంట్లలో కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ను తీసుకువచ్చిన
  • హీరో 9 శాతం అధిక మైలేజీ ఇస్తుందన్న కంపెనీ

భారత్ లో మరికొన్ని నెలల్లో బీఎస్-6 ప్రమాణాలు అమలు చేయనున్న నేపథ్యంలో వాహన తయారీదారులు ఇప్పటినుంచే పాత మోడళ్లను ఆధునికీకరిస్తున్నారు. తాజాగా, హీరో మోటోకార్ప్ తన ఎంట్రీ లెవల్ బైకు హెచ్ఎఫ్ డీలక్స్ ను బీఎస్-6 ప్రమాణాలతో సరికొత్తగా ముస్తాబు చేసింది.

బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ బైకును తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. 100 సీసీ ఇంజిన్ కు పది సెన్సార్లతో కూడిన ఎక్స్ సెన్స్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు. పాత మోడల్ బండి కంటే కొత్త మోడల్ తొమ్మిది శాతం అధిక మైలేజి ఇస్తుందని కంపెనీ వర్గాలంటున్నాయి. దీని ధర రూ.55,925 నుంచి రూ.57,250 వరకు ఉంటుంది. కాగా, మరికొన్ని వారాల్లో మిగతా మోడళ్లను కూడా బీఎస్-6 ప్రమాణాలతో తీసుకువచ్చేందుకు హీరో మోటోకార్ప్ సన్నద్ధమవుతోంది.

More Telugu News