CAA and NRC: సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: డిఎంకే చీఫ్ స్టాలిన్

  • ప్రజలు రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకుంటున్నారు
  • కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతించిన స్టాలిన్ 
  • తమిళనాట ఊపందుకున్న నిరసన ర్యాలీలు

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిఎంకే అధ్యక్షుడు ఎంకె. స్టాలిన్ డిమాండ్ చేశారు. సీఏఏను ఉపసంహరించుకోవాలని కేరళ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని స్టాలిన్ స్వాగతించారు. ఈ మేరకు స్టాలిన్ సామాజిక మాధ్యమంగా తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ‘దేశంలో ప్రజలు రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకుంటున్నారు. దీనికోసం దేశంలోని అన్ని అసెంబ్లీలు సీఏఏకు వ్యతిరేకంగా తప్పకుండా తీర్మానం చేయాలి’ అని స్టాలిన్ పేర్కొన్నారు.

సీఏఏ, ఎన్నార్సీలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. తమిళనాడులో సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ.. ప్రజలు భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఈ ప్రదర్శనల్లో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొంటున్నారు. ఇటీవల జరిపిన ర్యాలీల్లో స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా పాల్గొన్నారు.

More Telugu News