New year celebrations: 2020 లోకి ప్రవేశించిన న్యూజిలాండ్.. ఆనందోత్సాహాలతో స్వాగతం చెప్పిన ప్రజలు!

  • కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
  • రంగురంగుల బాణసంచాతో ప్రకాశించిన ఆకాశం
  • సమోవా, క్రిస్టమస్ దీవుల్లో వేడుకల తర్వాత న్యూజిలాండ్ వెల్ కం

2020 సంవత్సరానికి స్వాగతం చెప్పడంలో న్యూజిలాండ్ కు చెందిన అక్లాండ్, వెల్లింగ్టన్ లు ముందున్నాయి. కొత్త దశాబ్ది వెలుగులు ఇక్కడ ముందే విరజిమ్మాయి. కన్నులు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను ఇక్కడి ప్రజలు జరుపుకున్నారు. 1075 అడుగుల ఎత్తైన స్కై టవర్ పై జరిపిన బాణసంచా కాల్పులు ఆకాశాన్ని రంగులమయం చేశాయి.  

లండన్ లోని గ్రీన్ విచ్ రేఖాంశం ప్రకారం.. కొత్త సంవత్సరం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సమోవా, క్రిస్టమస్ దీవుల్లోని ప్రజలు తొలుత జరుపుకుంటారు. అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి. సమోవా, క్రిస్టమస్ దీవుల్లో అర్ధరాత్రి 12 గంటలు కొట్టిన అర్ధగంట తర్వాత న్యూజిలాండ్ లో గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలవుతుంది. అక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లో ఈసారి ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. గడియారం 12 గంటలు కొట్టగానే ఒక్కసారిగా ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు ఆకాశంలో రంగురంగుల కాంతులతో తారా జువ్వలు సందడి చేశాయి. 

More Telugu News