Devineni Uma: రైతుల భూములు చదును చేసి ఇవ్వడం కాదు, అభివృద్ధి చేసి ఇవ్వాలి: దేవినేని ఉమ

  • ఏపీ మంత్రులు సీఆర్డీఏ చట్టాన్ని చదవాలని హితవు
  • పెద్దిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు
  • మూడేళ్లలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్

ఏపీ సీఆర్డీఏ చట్టంలోని అంశాలను ఏపీ మంత్రులు ఓసారి చదువుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. రాజధానిలో రైతుల భూములను అభివృద్ధి చేసి ఇవ్వడానికి బదులు, చదును చేసి ఇస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఉమ విమర్శించారు. రైతుల చేతుల్లోంచి భూములు ఎప్పుడో సీఆర్డీఏ చేతుల్లోకి వెళ్లాయని, సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆ భూములను అభివృద్ధి చేసి తిరిగి రైతులకు అప్పగించాలని అన్నారు. మూడేళ్లలో ఈ ప్లాట్లను రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉమ ఇవాళ గొల్లపూడిలో 24 గంటల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News