Kerala Assembly: సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన కేరళ అసెంబ్లీ

  • తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం విజయన్
  • మద్దతు పలికిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి
  • వ్యతిరేకించిన బీజేపీ ఏకైక ఎమ్మెల్యే

జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికారపక్ష సీపీఎంతో తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మద్దతు పలికింది. బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి ఓ.రాజగోపాల్ మాత్రమే ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సభలో ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టారు.

తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా విజయన్ మాట్లాడుతూ, సెక్యులర్ భావజాలానికి వ్యతిరేకంగా ఈ సీఏఏ ఉందని అన్నారు. దేశాన్ని మత వివక్ష దిశగా ఈ చట్టం తీసుకెళ్తుందని చెప్పారు. సీఏఏ అమలును కేంద్రం విరమించుకోవాలని... రాజ్యాంగంలోని లౌకికతత్వాన్ని కాపాడాలని అన్నారు. అంతర్జాతీయ సమాజం ముందు ఇండియా ఇమేజ్ ను ఈ చట్టం దెబ్బతీసిందని చెప్పారు. కేరళలో ఎలాంటి నిర్బంధ గృహాలు లేవని తెలిపారు.

More Telugu News