Maharashtra: ప్రమాణ స్వీకారంలో మీ ఇష్టం వచ్చింది చదవడానికి వీల్లేదు.. నేతలకు మహారాష్ట్ర గవర్నర్ మందలింపు

  • మహారాష్ట్ర క్యాబినెట్ ప్రమాణ స్వీకారంలో ఘటన
  • సొంత వాక్యాలు జోడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • పత్రంలో ఉన్నది మాత్రమే చదవాలంటూ స్పష్టం చేసిన గవర్నర్

మహారాష్ట్ర క్యాబినెట్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా, ప్రమాణస్వీకారం వేళ నేతలు భావోద్వేగాలకు గురవుతుంటారు. ప్రమాణస్వీకార పత్రంలో ఉన్న వాక్యాలకు తోడు తమ సొంతవాక్యాలను కూడా జోడిస్తుంటారు. సరిగ్గా ఈ అంశంలోనే ఇద్దరు ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మందలించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ పాడ్వీ మంత్రిగా ప్రమాణస్వీకార పత్రం చదవడం పూర్తయ్యాక, తన సొంత వాక్యాల్లో ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రయత్నించారు. దాంతో, గవర్నర్ జోక్యం చేసుకుని, మీకు రాసిచ్చింది చదవండి చాలు అంటూ మందలింపు ధోరణి కనబర్చారు.

వర్ష గైక్వాడ్ అనే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన ప్రమాణం సందర్భంగా అంబేద్కర్ ప్రస్తావన తీసుకువచ్చారు. మరోసారి స్పందించిన గవర్నర్ కాసింత అసహనం ప్రదర్శిస్తూ, మీకు ఇచ్చిన రాతప్రతిలో ఉన్నదే చదవాలంటూ స్పష్టం చేశారు.

More Telugu News