Regina: విలక్షణమైన పాత్రలో రెజీనా

  • 'ఎవరు'తో హిట్ కొట్టిన రెజీనా 
  • కార్తీక్ రాజుతో తమిళ చిత్రం 
  • వచ్చేనెల 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్

తెలుగులో అందం .. అభినయం కలగలిసిన కథానాయికలలో రెజీనా ఒకరుగా కనిపిస్తుంది. జయాపజయాల సంగతి అటుంచితే, పాత్రకి న్యాయం చేస్తూ నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన 'ఎవరు' సినిమా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళంలో ఒక సినిమా చేయడానికి  సిద్ధమవుతోంది.

జనవరి 2వ వారం నుంచి చెన్నై లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించనున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో లెక్క తప్పకుండా జోస్యం చెప్పే పాత్రలో రెజీనా కనిపిస్తుందని అంటున్నారు. ఈ పాత్ర చాలా విలక్షణమైనది కావడంతో, తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని రెజీనా భావిస్తోంది. ఈ సినిమా హిట్ కొడితే, నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు మరికొన్ని ఆమె తలుపు తట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News