Taliban commander: తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ.. ముఖ్యనేత సైఫుల్లా హతం

  • హక్కానీ నెట్‌వర్క్ దాడిలో సైఫుల్లా సహా ముగ్గురి హతం
  • కరాచీలో బస్సుపై దాడిచేసి 45 మందిని పొట్టనపెట్టుకున్న సైఫుల్లా
  • 2016లో అరెస్ట్ చేసిన అమెరికా.. 14 నెలల తర్వాత విడుదల

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ తాలిబన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక వేర్పాటువాద గ్రూపు హక్కానీ నెట్‌వర్క్ జరిపిన దాడిలో కరుడుగట్టిన తాలిబన్ కమాండర్, తెహ్రిక్-ఇ-తాలిబన్-పాకిస్థాన్ (టీటీపీ) నేత క్వారీ సైఫుల్లా మెహసూద్ హతమయ్యాడు. ఖోస్త్ ప్రావిన్స్‌లోని గులూన్ స్థావరం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో సైఫుల్లాతోపాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కరుడుగట్టిన ఉగ్రవాది అయిన సైఫుల్లాను 2016లో ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 14 నెలల అనంతరం విడుదలయ్యాడు. అంతకుముందు 2015లో కరాచీలో బస్సుపై దాడి చేసి 45 మంది ప్రాణాలు తీశాడు. ఈ ఏడాది ఖైబర్ పంక్తుంఖ్వాలోని ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో ఏకంగా 75 దాడులకు పాల్పడినట్టు సైపుల్లా స్వయంగా వెల్లడించాడు. అతడి మృతి టీటీపీకి పెద్ద ఎదురుదెబ్బేనని అంటున్నారు.

More Telugu News