Bangladesh: బంగ్లాదేశ్ లో మహిళల బాడీ బిల్డింగ్ పోటీలు.. ఇవెక్కడి పోటీలంటూ విస్తుపోతున్న జనం!

  • ముస్లిం దేశం కావడంతో నిర్వాహకుల అతి జాగ్రత్తలు 
  • కండలను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులతో బరిలోకి పోటీదారులు
  • చాంపియన్‌గా నిలిచిన 19 ఏళ్ల విద్యార్థిని

బంగ్లాదేశ్‌లో తొలిసారి నిర్వహించిన మహిళల జాతీయ బాడీబిల్డింగ్ పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా బాడీబిల్డింగ్ అంటే తమ కండలను ప్రదర్శిస్తారు. అయితే, బంగ్లాదేశ్ ముస్లిం దేశం కావడం, పోటీల్లో పాల్గొన్నవారంతా ముస్లిం మహిళలే కావడంతో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, విమర్శలకు తావివ్వకుండా వారు చేసిన ప్రయత్నం అందరి నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.

ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలు కండలను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించి పాల్గొనడంతో ప్రేక్షకులు నిర్వెరపోయారు. కండలు బయటకు ప్రదర్శించకుండా విజేతలను ఎలా ఎంపిక చేస్తారో తెలియక బుర్రలు బద్దలుగొట్టుకున్నారు. ఈ పోటీల్లో 19 ఏళ్ల విద్యార్థిని అహోనా రహమాన్ బంగ్లాదేశ్ తొలి తొలి మహిళా చాంపియన్‌గా అవతరించింది.

More Telugu News