Army: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు అతి పెద్ద బాధ్యత అప్పగింత

  • త్రివిధ దళాల మహాధిపతిగా రావత్ నియామకం
  • ఆర్మీ చీఫ్ గా రేపు పదవీ విరమణ చేయనున్న రావత్
  • రేపటి నుంచే సీడీఎస్ గా బాధ్యతలు

భారత త్రివిధ దళాలను ఒకే ఛత్రం కింద సమన్వయం చేసే దిశగా కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా నియమించింది. సీడీఎస్ పదవిని అలంకరించిన తొలి వ్యక్తిగా బిపిన్ రావత్ చరిత్రలో నిలిపోనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ గా రావత్ పదవీకాలం డిసెంబరు 31తో ముగియనుంది. సరిగ్గా ఆ రోజు నుంచే ఆయన సీడీఎస్ గా పని ప్రారంభిస్తారు. సీడీఎస్ పదవిలోని వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని కేంద్రం 65 ఏళ్లుగా నిర్ధారించింది.

More Telugu News