New Year celebrations: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

  • రాత్రి 11 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు  
  • హైదరాబాద్,  సైబరాబాద్‌, రాచకొండ పరిధుల్లో అమలు
  • మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు చర్యలు

హైదరాబాద్ లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఒక ప్రకటన చేశారు. రహదారులపై రేపు అమలు చేయనున్న ట్రాఫిక్ ఆంక్షల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్,  సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో రేపు రాత్రి 11 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్‌టవర్స్‌, మైండ్ ‌స్పేస్‌, కామినేని, ఎల్బీనగర్‌, తెలుగుతల్లి, నల్లగొండ చౌరస్తా, పంజాగుట్ట ఫ్లైఓవర్లు, చింతకుంట అండర్‌పాస్‌ మూసివేస్తున్నట్లు చెప్పారు. వాహనాల వేగం నియంత్రణకు పలు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News