pakistan: పాక్ తొలి న్యాయశాఖ మంత్రి తిరిగి భారత్ కే ఎందుకొచ్చేశారు?: జీవీఎల్

  • పాక్ తొలి న్యాయశాఖ మంత్రి యోగేంద్రనాథ్ మండల్
  • ఆయన హిందూ-దళిత్..ఆ దేశంలో ఇమడలేకపోయారు
  • బతికుంటే చాలని భావించి రెండేళ్లకే భారత్ కు వచ్చేశారు

మన దేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బీఆర్ అంబేద్కర్ అని, ఆయనంటే మనందరికి ఎంతో గౌరవమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పేరు యోగేంద్రనాథ్ మండల్ అనీ, ఆయన హిందూ-దళిత్ అని చెప్పారు.

అయితే, ఆయన పాకిస్థాన్ లో ఇమడలేకపోయారని, బతికుంటే చాలని భావించి రెండేళ్లకే తిరిగి భారత్ కు వచ్చేసి పశ్చిమబెంగాల్ లో స్థిరపడిన విషయాన్ని జీవీఎల్ గుర్తుచేశారు. కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తి, రాజ్యాంగ ఏర్పాటులో పాత్ర ఉన్న వ్యక్తి ఎవరైనా దేశం వదిలి వెళ్లారంటే, వివక్షకు గురికాలేదని ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం కింద ఎవరెవరికైతే పౌరసత్వం రానుందో వారిలో దాదాపు 65 శాతం మంది దళిత వర్గానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సోనియా, రాహుల్ గాంధీ, మాయావతిలు దళిత వర్గానికి వ్యతిరేకులా? అని ఆయన ప్రశ్నించారు.

More Telugu News