Ranga Reddy District: రంగారెడ్డి జిల్లా యాచారంలో ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్న రైతులు

  • ఫార్మా కంపెనీల ఏర్పాటుతో కాలుష్యం పెరిగిపోతుంది
  • అవసరమైతే, ఐటీ కంపెనీలకు భూములిస్తాం
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మా కంపెనీలను రానివ్వం

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో ఫార్మాసిటీని రైతులు వ్యతిరేకిస్తున్నారు. యాచారంలో పార్మాసిటీ ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో కాలుష్యం పెరిగిపోతుందని అంటున్నారు. అవసరమైతే, ఐటీ కంపెనీలకు భూములిస్తాం తప్ప ఫార్మా కంపెనీలకు ఇవ్వమని తెగేసి చెప్పారు. 100 గ్రామాల్లో ఇరవై వేల కుటుంబాలు కాలుష్యం బారిన పడతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయనివ్వమని యాచారం రైతులు చెబతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించాలని, తమను అర్థం చేసుకోవాలని కోరారు.

More Telugu News