Botsa Satyanarayana: రాజధాని ఎక్కడున్నా మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవాలి: బొత్స

  • కమిటీ నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • లక్ష కోట్లతో రాజధాని కుదిరే పనికాదని వ్యాఖ్యలు
  • అన్ని ప్రాంతాల అభివృద్ధే వైసీపీ ధ్యేయమంటూ ఉద్ఘాటన

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని అంశంపై స్పందించారు. రాజధానిపై కమిటీలు వేశామని, వాటి నివేదికల్లోని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజధాని ఎక్కడున్నా తమకు ఇబ్బందేమీలేదని, కానీ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవాలని అన్నారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం, అభివృద్ధి చేయడం జరిగే పని కాదని స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్దే సీఎం జగన్ లక్ష్యం అని ఉద్ఘాటించారు. అన్ని ప్రాంతాలను పైకి తీసుకురావడమే వైసీపీ ధ్యేయమని తెలిపారు.

More Telugu News