ICC: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో కోహ్లీ స్థానం పదిలం

  • టెస్టు బ్యాటింగ్ ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
  • అగ్రస్థానంలో కోహ్లీ
  • రెండోస్థానంలో స్టీవ్ స్మిత్

టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్ లో భారత సారథి విరాట్ కోహ్లీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో కోహ్లీ తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. 928 పాయింట్లతో కోహ్లీ ఈ జాబితాలో నెంబర్ వన్ ప్లేసులో ఉన్నాడు. కోహ్లీ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (911), న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (822) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక, భారత బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా ఓ స్థానం పతనమై ఐదోస్థానానికి పడిపోయాడు. ఇటీవల అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్న ఆసీస్ ఆల్ రౌండర్ మార్నస్ లబుషేన్ నాలుగోస్థానానికి ఎగబాకాడు. ఇక, ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా యువకెరటం క్వింటన్ డికాక్ ఐసీసీ టాప్-10లోకి దూసుకొచ్చాడు.

More Telugu News