Nani: మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే వాళ్ల సంఘాలు ఏమైపోయాయి?: మంత్రి పేర్ని నాని

  • అక్రెడిటేషన్ కోసం జర్నలిస్టు యూనియన్లు ఎగబడతాయి
  • మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఖండించకపోవడం సరికాదు
  • నిజమైన రైతు ఎవరిమీదా దాడులు చేయడు

అక్రెడిటేషన్ కోసం ఎగబడే జర్నలిస్టు యూనియన్లు మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఏమైపోయాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో కొందరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేర్ని నాని మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఖండించకపోవడం సరికాదన్నారు.

ఎన్టీవీ హరీశ్, టీవీ9 దీప్తి, మహాటీవీ వసంత్ లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని నాని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులను కొట్టిన వారిని చంద్రబాబు నాయుడు, లోకేశ్ సమర్థించడం దారుణమన్నారు. కష్టం గురించి తెలిసిన వాడు రైతని, నిజమైన రైతు ఎవరిమీదా దాడులు చేయడని అన్నారు. అసలైన రైతుల ఆందోళన శాంతియుతంగా ఉంటుందని చెప్పారు. దాడి చేసిన వారిని ఎవరు ప్రేరేపించారో అందరికీ తెలుసని అన్నారు.

More Telugu News