రషీద్ ఖాన్ ఆ బ్యాట్ తోనే ఆడాలంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్!

30-12-2019 Mon 12:24
  • ప్రస్తుతం బీబీఎల్ లో ఆడుతున్న రషీద్
  • తన కొత్త బ్యాట్ తో మెరుపులు
  • 2020 ఐపీఎల్ లోనూ అదే బ్యాట్ వాడతానని వెల్లడి

ఆఫ్ఘన్ యువ క్రికెటర్ రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం బిగ్‌ బాష్‌ లీగ్‌ లో తన బ్యాట్ తో మెరుపులు మెరిపించగా, వచ్చే సంవత్సరం జరిగే ఐపీఎల్ పోటీలకు అదే బ్యాట్ ను తీసుకుని వచ్చి ఆడాలని సన్ రైజర్స్ హైదరాబాద్ కోరింది. దీనికి సరేనని రషీద్ ఖాన్ బదులిచ్చాడు కూడా.

ఇటీవల అడిలైడ్‌ స్ట్రయికర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తరఫున బరిలోకి దిగిన రషీద్ ఖాన్, తన కొత్త బ్యాట్ తో 16 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 2 సిక్స్‌ లు ఉన్నాయి. ఆపై తాను బౌలింగ్ చేసిన 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్రను కూడా రషీద్ పోషించాడు.

ఇక రషీద్ వాడిన బ్యాట్ ను 'ది కెమల్‌'గా అభివర్ణించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఓ ట్వీట్‌ పెట్టగా, సన్‌ రైజర్స్‌ టీమ్‌ స్పందించింది. రషీద్‌ అదే బ్యాట్‌ ను 2020 ఐపీఎల్‌ కు తీసుకురావాలని కోరుతూ ట్వీట్‌ చేసింది. దీనికి బదులిచ్చిన రషీద్, తప్పకుండా కెమల్‌ బ్యాట్‌ ను తీసుకువస్తానని చెప్పాడు.