Prakash Raj: 'రంగమార్తాండ' స్పీడు మీదే వున్నాడు

  • మరాఠీ రీమేక్ గా 'రంగమార్తాండ'
  • చకచకా జరుగుతున్న షూటింగ్ 
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు 

కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' రూపొందుతోంది. కొంతకాలం క్రితం మరాఠీలో వచ్చిన 'నట సామ్రాట్'కి రీమేక్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, బ్రహ్మానందం .. అనసూయ .. రాహుల్ సిప్లిగంజ్ .. ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కృష్ణవంశీ వున్నాడు. ఆ దిశగానే చకచకా షూటింగును కానిచ్చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News