Kamal: 'భారతీయుడు 2' కోసం బాబీసింహాపై సన్నివేశాల చిత్రీకరణ

  • సర్జరీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కమల్ 
  •  బాబీ సింహాపై కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • జనవరిలో షూటింగులో జాయిన్ కానున్న కాజల్ 

శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' రూపొందుతోంది. ఈ సీక్వెల్ లోను కమల్ యువకుడిగాను .. వృద్ధుడిగాను కనిపించనున్నాడు. ఆయనకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను ఇప్పటికే పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా చెన్నైలో ప్రత్యేకంగా వేయబడిన భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్లో కమల్ పాల్గొనడం లేదట.

ఆ మధ్య ఆయన కాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన కాలులో అమర్చబడిన లోహపు భాగాలను రీసెంట్ గా మరో సర్జరీ ద్వారా తొలగించారు. అందువలన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి మళ్లీ ఆయన షూటింగులో పాల్గొంటారని అంటున్నారు. ఈ కారణంగా ఈ వ్యవధిలో బాబీ సింహాపై సన్నివేశాలను ప్లాన్ చేసుకున్నారట. ఈ సినిమాలో బాబీసింహా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన కాంబినేషన్లోని ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగులోను తన మార్కెట్ పెరుగుతుందని బాబీసింహా భావిస్తున్నాడు. జనవరి నుంచి కాజల్ ఈ షూటింగులో జాయిన్ కానుందని చెబుతున్నారు.

More Telugu News