Pakistan: కూతురు హిందూ సంప్రదాయాన్ని అనుకరించిందన్న కారణంతో టీవీ పగులగొట్టిన పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం

  • భారత టీవీ చానల్లో హారతి ఇచ్చే దృశ్యం చూసిన అఫ్రిదీ కుమార్తె
  • తాను కూడా పళ్లెం తీసుకుని హారతి ఇచ్చిన చిన్నారి
  • ఆగ్రహంతో రగిలిపోయిన అఫ్రిది

పాకిస్థాన్ వరకు షాహిద్ అఫ్రిది ఓ క్రికెట్ దిగ్గజం. అయితే భారత క్రికెటర్లన్నా, భారతదేశమన్నా వ్యతిరేకత భావనలు ఉన్నవారిలో అఫ్రిదీ కూడా ఉంటాడు. తాజాగా హిందూమతంపై అతడికి ఎంత అక్కసు ఉందో తెలిపే ఘటన వెల్లడైంది. ఓసారి అఫ్రిది కుమార్తె ఓ భారత టీవీ చానల్ చూస్తూ అందులో హారతి ఇవ్వడాన్ని ఆసక్తిగా గమనించింది.

 అంతేకాదు, తాను కూడా ఓ పళ్లెం తీసుకుని హారతి ఇవ్వడాన్ని అనుకరించింది. ఓ హిందూ సంప్రదాయాన్ని తన కుమార్తె అనుకరించడాన్ని అఫ్రిది భరించలేకపోయాడు. పట్టలేని ఆగ్రహంతో ఆ టీవీ పగులగొట్టేశాడట! ఈ ఘనకార్యం గురించి అఫ్రిదీనే స్వయంగా వెల్లడించాడు. ఓ టీవీ షోలో అఫ్రిది ఈ విషయం చెప్పగా, అక్కడున్న ప్రేక్షకులు అదేదో గొప్ప పని అయినట్టు పగలబడి నవ్వారు.

More Telugu News