Ranji Trophy: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ ఎవరో తెలుసా?

  • దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వినయ్ కుమార్
  • వినయ్ కుమార్ కర్ణాటక రంజీ ఆటగాడు
  • 412 వికెట్లతో రంజీల్లో టాప్ వికెట్ టేకర్

సాధారణంగా ఏ దేశ జాతీయ క్రికెట్ జట్టుకైనా దేశవాళీ క్రికెట్ ప్రాతిపదికగా నిలుస్తుంది. దేశవాళీల్లో ప్రతిభ చూపించినవారిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం పరిపాటి. కానీ కొన్నిసార్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎంత ప్రతిభ చూపించినా అదృష్టం కలిసిరాకపోతే వారికి నేషనల్ టీమ్ లో స్థానం దొరకదు. ఒకవేళ దొరికినా సరైన అవకాశాలు రావు. అలాంటి క్రికెటర్లలో ఒకడు వినయ్ కుమార్. కర్ణాటక రంజీ జట్టు ఆటగాడైన వినయ్ కుమార్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.

మిజోరాం జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్ లో వినయ్ కుమార్ 3 వికెట్లు తీశాడు. దాంతో మొత్తం 412 వికెట్లతో రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ గా అవతరించాడు. ఇప్పటివరకు ఆ రికార్డు పంకజ్ సింగ్ (409) పేరిట ఉంది. అయితే, ఓవరాల్ బౌలర్ల జాబితాలో మాత్రం వినయ్ కుమార్ ఏడోస్థానంలో నిలిచాడు. స్పిన్నర్ రాజీందర్ గోయెల్ 637 వికెట్లతో రంజీ చరిత్రలో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో ఎస్.వెంకట్రాఘవన్ 530 వికెట్లతో రెండోస్థానంలో నిలిచాడు.

More Telugu News