amaravathi: రైతులు సానుకూలంగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా: మంత్రి కొడాలి నాని

  • గ్రాఫిక్స్ తో చూపిన రాజధాని కట్టాలంటే లక్షా 15 వేల కోట్లు కావాలి
  • అంత ఆర్థికపరిస్థితి ప్రభుత్వానికి లేదు
  • గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టాలి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం అని, జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా అదే సూచించిందని మంత్రి కొడాలి నాని అన్నారు. హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నాని మీడియాతో మాట్లాడుతూ, రాజధాని తరలిస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదని, అమరావతితో పాటు మరో రెండు  ప్రాంతాల్లో రాజధాని ఉంటే వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని అన్నారు. రైతుల భూముల్లో భారీగా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి చంద్రబాబు డబ్బు దండుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు తన హయాంలో గ్రాఫిక్స్ తో చూపిన రాజధాని కట్టాలంటే లక్షా 15 వేల కోట్లు అవసరం అని, ప్రభుత్వ ఆర్థికపరిస్థితి అంతగా లేదని చెప్పారు. ఈ విషయాన్ని రాజధాని రైతులకు తెలుపుతామని, అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి కనుక రైతులు సానుకూలంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టాలని, ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధులు సమకూర్చాలని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హై పవర్ కమిటీ నివేదిక ఉంటుందని చెప్పారు.

More Telugu News