Chiranjeevi: న్యూ మూవీ అప్ డేట్... దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా మెగాస్టార్ చిరంజీవి!

  • రామ్ చరణ్ నిర్మాతగా 152వ చిత్రం
  • హీరోయిన్ గా నటించనున్న త్రిష
  • స్వరాలను సమకూర్చనున్న మణిశర్మ

'సైరా నరసింహారెడ్డి' సినిమా తరువాత, రామ్ చరణ్ నిర్మాతగా, కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి, దేవాదాయ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన లుక్ కోసం చిరంజీవి నిత్యమూ జిమ్ లో శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటించనుంది. ఫిబ్రవరిలోగా, ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాటినీ ఎంటర్‌ టెయిన్ మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.

More Telugu News