somalia: సోమాలియా కారుబాంబు పేలుడులో 73కు పెరిగిన మృతుల సంఖ్య

  • సోమాలియాలో నిన్న భారీ ఉగ్రదాడి
  • మృతుల్లో యూనివర్సిటీ విద్యార్థులు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన కారు బాంబు పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 73కు పెరిగింది. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతను బట్టి చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో చాలామంది స్థానిక యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నట్టు మేయర్ మహమూద్ తెలిపారు. ఇప్పటి వరకు 73 మృతదేహాలను వెలికి తీసినట్టు పేర్కొన్నారు.

కాగా, ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు. అయితే, అల్‌‌ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ పని కావొచ్చని భావిస్తున్నారు. అక్టోబరు 2017లో అల్-షబాబ్ జరిపిన ట్రక్కు బాంబు పేలుడులో 500 మందికిపైగా మృతిచెందారు.

More Telugu News