Apps: అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకుంటున్న యాప్స్ ఇవే!

  • ఈ దశాబ్దంలో ఫేస్ బుక్ టాప్
  • జాబితాలో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్
  • జాబితాను విడుదల చేసిన యాప్ యూనీ

2010 నుంచి 2019 వరకూ అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకుంటున్న యాప్ ల వివరాలను యాప్ యానీ వెల్లడించింది. ఈ జాబితాలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానం ఫేస్‌ బుక్ మెసెంజర్ ది. ఈ దశాబ్ద కాలంలో ఫేస్ బుక్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, నెటిజన్ల నుంచి మాత్రం ఫేస్ బుక్ పై ఆదరణ ఎంతమాత్రమూ తగ్గలేదు. భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలపై ఆరోపణలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం తదితరాలు ఫేస్ బుక్ ను కుదిపేసినా, డౌన్ లోడ్ల సంఖ్య ఏ మాత్రమూ తగ్గలేదు.

ఇక యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ జాబితాను పరిశీలిస్తే, ఫేస్‌ బుక్‌, ఫేస్‌ బుక్‌ మెసేంజర్‌, వాట్సాప్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, స్నాప్‌ చాట్‌, టిక్‌ టాక్‌, యూసీ బ్రౌజర్, యూట్యూబ్‌, ట్విటర్‌ లున్నాయి.

More Telugu News