CPM Sitharam Yechuri: 12 రాష్ట్రాల సీఎంలు ఎన్నార్సీని అమలు చేయమని ప్రకటించారు: సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

  • ఎన్పీఆర్‌ను కూడా వ్యతిరేకించాలి
  • నిరసనల్లో దేశ వ్యాప్తంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు
  • ఎన్నార్సీ పై నిరసనలు శాంతియుతంగా సాగుతున్నాయి

దేశంలోని 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు  ఎన్నార్సీని అమలు చేయమని ప్రకటించారని.. ఎన్పీఆర్‌ను కూడా వ్యతిరేకించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  విజ్ఞప్తి చేశారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుపుతున్న నిరసనల్లో దేశ వ్యాప్తంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఆ నేరాలను ప్రజలపై మోపుతున్నారని ఏచూరి మండిపడ్డారు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నార్సీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలన్నీ శాంతియుతంగా జరుగుతున్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నార్సీని తీసుకువస్తామని ఎనిమిదిసార్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఇది పార్లమెంట్‌ రికార్డుల్లో ఉందని.. ఈ విషయం ప్రధాని మోదీకి తెలియదని తాము అనుకోవడం లేదన్నారు.  

ఎన్నార్సీపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు: తమ్మినేని వీరభద్రం

ఎన్నార్సీపై  సీఎం కేసీఆర్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. అసదుద్దీన్‌ ఒవైసీ కోసం మొదట్లో వ్యతిరేకిస్తారని.. అనంతరం మోదీ, షా ఫోన్‌ చేయగానే కేసీఆర్ మారిపోతున్నారని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను తప్పించి మిగతా పార్టీలతో కలిసి తమ పార్టీ పోటీకి సిద్ధమని తెలిపారు.

More Telugu News