Congress leader Priyanka Gandhi: యూపీ పోలీసులు నాపై చేయి చేసుకున్నారు: ప్రియాంక గాంధీ ఆరోపణ

  • మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబాన్ని కలవడానికి వెళ్లాను  
  • మా ద్విచక్రవాహనాన్ని అడ్డుకుని ముందుకు వెళ్లనియ్యలేదు
  • నడుచుకుంటూ వెళుతున్నప్పుడు తోసేశారు

యూపీ రాజధాని లక్నోలో పోలీసులు తన మార్గాన్ని అడ్డుకోవడమేకాక, తనపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొని అరెస్టయిన మాజీ ఐపీఎస్ అధికారి దారాపురి కుటుంబాన్ని కలుసుకోవడానికి వెళతున్న సమయంలో ఈ ఘటన చోసుకుందని ప్రియాంక మీడియాతో చెప్పారు.

‘కార్యకర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతున్నాను. అనుకోకుండా ఓ పోలీస్ వాహనం మా ముందుకు వచ్చి ఆగింది. అందులోని పోలీసులు నన్ను ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. దాంతో నేను నడుచుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో పోలీసులు నాపై చేయి చేసుకున్నారు. ఒక పక్కకు తోసేశారు’ అని ప్రియాంక వెల్లడించారు. పోలీసుల వైఖరిపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి కారణం లేకుండానే పోలీసులు నడిరోడ్డులో తనను ఆపేశారన్నారు. వాళ్లు ఇలా ఎందుకు చేశారో దేవుడికే తెలియాలన్నారు. 72 ఏళ్ల దారాపురి ఒక క్యాన్సర్ రోగని, అతనిని అరెస్టు చేయడం దారుణమని ప్రియాంక వ్యాఖ్యానించారు.

More Telugu News