TTD: టీటీడీపై దుష్ప్రచారం చేసిన పత్రికపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా: వైవీ సుబ్బారెడ్డి

  • టీటీడీపై అసత్యప్రచారం చేస్తే కఠినచర్యలన్న వైవీ
  • ప్రత్యేక సైబర్ భద్రతాధికారిని నియమిస్తామని వెల్లడి
  • వైకుంఠ ఏకాదశి రోజున సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాల రద్దు

టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. టీటీడీపై అసత్య ప్రచారం చేసిన ఓ పత్రికపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నామని తెలిపారు. టీటీడీ సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. అంతేగాకుండా, వైకుంఠ ఏకాదశి నాడు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, కశ్మీర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

More Telugu News