Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై 'న్యూస్99' దినపత్రికలో ప్రత్యేక కథనం!

  • ప్రత్యేక సంచిక తీసుకువచ్చిన న్యూస్99
  • 'తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే!' అంటూ శీర్షిక
  • సోషల్ మీడియాలో పంచుకున్న జనసేన పార్టీ

పవన్ కల్యాణ్... అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఎప్పుడూ ప్రత్యేకమే! సినీ రంగంలో తనదైన ముద్రవేసిన ఈ మెగా కుటుంబసభ్యుడు, రాజకీయాల్లోనూ తన ప్రభావం చూపించేందుకు తహతహలాడుతున్నాడు. తాజాగా, ఈ జనసేన పార్టీ అధినేతపై ఓ తెలుగు దినపత్రిక భారీ కథనం వెలువరించింది. ఇటీవలే ప్రస్థానం ఆరంభించిన న్యూస్ 99 మీడియా సంస్థ పవన్ పై ప్రత్యేక సంచిక తీసుకువచ్చింది. 'తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే!'  అనే శీర్షికతో వచ్చిన ఈ కథనాన్ని జనసేన పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో పంచుకున్నాయి.

More Telugu News