Andhra Pradesh: రేపు అఖిలపక్షం తలపెట్టిన గుంటూరు జిల్లా బంద్ వాయిదా

  • ఏపీ రాజధాని మార్పుపై తీవ్ర ఆందోళనలు
  • బంద్ కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
  • మంత్రివర్గ భేటీలో వెలువడని రాజధాని ప్రకటన
  • బంద్ నిర్ణయం వాయిదా వేసుకున్న అఖిలపక్షం

ఏపీలో రాజధాని మార్పును నిరసిస్తూ శనివారం గుంటూరు జిల్లా బంద్ కు అఖిలపక్షం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బంద్ ను వాయిదా వేస్తున్నట్టు అఖిలపక్షం తెలిపింది. ఈ మధ్యాహ్నం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో రాజధానిపై ప్రకటన రానందున బంద్ ను వాయిదా వేశారు. బంద్ కు బదులుగా సోమవారం నుంచి గుంటూరులో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని అఖిలపక్షం తాజాగా నిర్ణయించింది.

అంతకుముందు, ఏపీ మంత్రివర్గ భేటీ అనంతరం పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి, జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు త్వరలో రాబోయే బీసీజీ నివేదికను కూడా అధ్యయనం చేసి ఆపై రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.  అంతకుమించి నూతన రాజధానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.

More Telugu News