Sourav Ganguly: గంగూలీ ఐడియాకి జైకొడుతున్న అగ్ర జట్ల క్రికెట్ బోర్డులు

  • నాలుగు అగ్ర జట్లతో టోర్నీ నిర్వహించాలన్న గంగూలీ
  • ప్రతి ఏటా నిర్వహించాలని ప్రతిపాదన
  • దాదా నిర్ణయాన్ని స్వాగతించిన ఈసీబీ, సీఏ

ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన పనితీరుతో అన్నివర్గాల మన్ననలు అందుకుంటున్నాడు. గంగూలీ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పాటునిచ్చేవిగా ఉండడంతో ఎవరూ ప్రశ్నించడంలేదు.

ప్రతి ఏడాది భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మరో అగ్రజట్టుతో నాలుగు దేశాల టోర్నీ నిర్వహించాలని గంగూలీ చేసిన ప్రతిపాదనకు పెద్ద జట్ల క్రికెట్ బోర్డుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ ఆలోచనను స్వాగతిస్తోంది. గంగూలీ బీసీసీఐలోకి వచ్చి రెండు నెలలే అయినా ఎంతో వినూత్నంగా ఆలోచిస్తున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ కొనియాడారు.

నాలుగు అగ్రశ్రేణి జట్లతో 2021 నుంచి క్రమం తప్పకుండా టోర్నీ నిర్వహిస్తే క్రికెట్ కు మరింత ఆదరణ లభించడం ఖాయమని గంగూలీ భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ నిర్ణయానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నుంచి మద్దతు లభించింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో బీసీసీఐలో హర్షం వెల్లివిరుస్తోంది.

More Telugu News