Warangal Rural District: ప్రియాంక, భూమిక మృతిచెంది నాలుగేళ్లు గడుస్తున్నా.. నిందితులను పట్టుకోలేదు: మంద కృష్ణ మండిపాటు

  • వారి మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలి
  • దిశ కేసులో స్పందించిన రీతిలో..ఈ కేసును పట్టించుకోవటం లేదు
  • వారు మృతిచెందిన స్థలాన్ని సందర్శించిన ఎమ్మార్పీస్ నేతలు

వరంగల్ రూరల్ జిల్లాలో  అనుమానాస్పదంగా మృతిచెందిన గిరిజన విద్యార్థినుల కేసులో... నాలుగేళ్లు గడిచిపోయినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. వారి మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో దిశ కేసులో నిందితులను పది రోజుల్లోనే ఎన్ కౌంటర్ చేశారంటూ.. ప్రియాంక, భూమిక కేసులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు.  

ఎమ్మార్పీస్ నేతలు, మానవ హక్కుల సంఘ నాయకులు, గిరిజన సంఘాల నాయకులతో కలిసి మంద కృష్ణ.. ప్రియాంక, భూమికలు మృతిచెందిన చెన్నారావుపేట మండలంలోని ఖాదర్ పేట శివారు గుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు గిరిజన విద్యార్థినులు అనుమానాస్పదంగా మృతి చెంది నాలుగేళ్లు గడుస్తున్నా నిందితులను ఇప్పటివరకు పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరానికి పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన ప్రముఖుల పిల్లలు ఉండటంతో ఈ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు.

More Telugu News