Aadhar cards issued to above 125 crore people: 125 కోట్ల మార్క్ ను దాటిన ఆధార్ కార్డుల జారీ

  • దేశంలో 93శాతం మంది ఆధార్ ను కలిగివున్నారు
  • ఇప్పటివరకు 331 కోట్ల ఆధార్ అప్ డేట్లను చేశాం
  • రోజుకు సుమారు 3 కోట్ల ఆధార్ ఆథెంటికేషన్ అభ్యర్థనలు తీసుకుంటున్నాం

భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(యుఐడీఏఐ- ఉడాయ్) ఆధార్ కార్డుల జారీలో ముందుకు దూసుకుపోతోంది. తాజాగా 125 కోట్ల మార్క్ ను దాటినట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 125 కోట్ల మందికి పైగా ఆధార్ కార్డులను పొందారని పేర్కొంది. ప్రస్తుత దేశ జనాభాలో 93 శాతం మంది ఆధార్ కార్డులను కలిగివున్నారని తెలుస్తోంది. ఈ మేరకు యుడీఏఐ ఒక ప్రకటన చేసింది.

‘ఆధార్ ప్రాజెక్టు అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం 125 కోట్ల మంది భారతీయులు ఆధార్ నంబరును కలిగి ఉన్నారు. ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 3 కోట్ల ఆధార్ ఆథెంటికేషన్ అభ్యర్థనలు స్వీకరిస్తున్నాము’ అని పేర్కొంది.

ఇదిలా వుండగా.. ఆధార్ అప్ డేట్ చేసుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోందని తెలిపింది. ఆధార్ అప్ డేషన్ కోసం వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లుగా ఉడాయ్ తెలిపింది. ఇప్పటివరకు 331 కోట్ల ఆధార్ అప్ డేట్లను విజయవంతంగా చేసినట్లు పేర్కొంది.  

More Telugu News