Amaravathi: రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు?: జగన్ కు చంద్రబాబు సూటిప్రశ్న

  • దేశ చరిత్రలో రాష్ట్ర రాజధానిని మార్చిన ఘటనలు ఎప్పుడైనా జరిగాయా?
  • అడ్మినిస్ట్రేషన్ ను వికేంద్రీకరించి ‘అభివృద్ధి’ అంటే ఎలా?
  •  జగన్ ఏడు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు

రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అని సీఎం జగన్ ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో రాష్ట్ర రాజధానిని మార్చిన ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేషన్ ను వికేంద్రీకరించి ‘అభివృద్ధి’ అంటే అయిపోదని, జగన్ ఏడు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు.

విశాఖపై అంతప్రేమ ఉంటే అక్కడ డేటా సెంటర్ రాకుండా వైసీపీ నేతలు ఎందుకు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. అదే కనుక ఆ సెంటర్ ఇక్కడ ఏర్పాటై ఉంటే నాలుగైదేళ్లలో హైదరాబాద్ స్థాయికి వెళ్లేదని చెప్పారు. ఫార్చూన్ 500 కంపెనీలకు కేంద్రంగా విశాఖను తయారు చేయాలని తన హయాంలో భావించి ముందుకెళ్లానని, ఇలాంటివి జరిగితే అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చని అన్నారు. 

రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశమే లేదని గ్రీన్ టైబ్యునల్ గతంలోనే పేర్కొందని, ఇక్కడ నిర్మాణాలకు పునాదులు వేసేందుకు అయ్యే ఖర్చులు చెన్నై, హైదరాబాద్ లతో పోల్చుకుంటే అమరావతిలోనే తక్కువ అవుతుందని ఐఐటీ చెన్నై గతంలో చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.  

More Telugu News