Illayaraja: ఇళయరాజాకు ప్రతిష్ఠాత్మక 'హరివరాసనం' అవార్డు

  • జనవరి 15న శబరిమలలో ప్రదానం
  • అయ్యప్ప పవళింపు పాటగా 'హరివరాసనం'
  • అయ్యప్ప కారణంగానే అవార్డు లభించిందన్న ఇళయరాజా

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది. ఆయనకు 'హరివరాసనం' అవార్డును బహూకరించి, సత్కరించనున్నట్టు పేర్కొంది. జనవరి 15న శబరిమలలో అవార్డును అందజేయనున్నట్టు కేరళ సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది. అయ్యప్ప పవళింపు సేవలో 'హరివరాసనం' పాటను పాడతారన్న సంగతి తెలిసిందే. 70 సంవత్సరాల ఇళయరాజా, తనకు వచ్చిన అవార్డుపై చెన్నైలో స్పందిస్తూ, అయ్యప్ప కరుణా కటాక్షాల కారణంగానే తనకు ఈ గుర్తింపు లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

More Telugu News