Air India: ప్రభుత్వ రంగ సంస్థలకు క్రెడిట్ విధానంలో టికెట్లివ్వం: ఎయిర్ ఇండియా

  • బకాయిలు చెల్లిస్తేనే టికెట్లు జారీచేస్తాం
  • ఎయిర్ ఇండియాకు రూ.268 కోట్లు బాకీపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలు
  • టికెట్ల జారీలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల అధికారిక ప్రయాణాలకు ఎయిర్ ఇండియా క్రెడిట్ విధానంలో టికెట్లు జారీ చేస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఈ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించి ప్రభుత్వరంగ సంస్థలకు  షాకిచ్చింది. ఎయిర్ ఇండియాకు ప్రభుత్వ రంగ సంస్థలనుంచి బకాయిలు రావాల్సి వున్న కారణంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ మేరకు ఎయిర్ ఇండియా ఓ ప్రకటన చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థల నుంచి తమకు రూ.268 కోట్లు రావాల్సి ఉందని ప్రకటించింది. ఆ బకాయిలు చెల్లించేంతవరకు కొత్తగా క్రెడిట్ విధానంలో టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా వుండగా, లోక్‌సభ సెక్రటేరియేట్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాఖలకు కొంత వరకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది.

More Telugu News