Jagan: ఇళ్ల స్థలాల అర్హుల ఎంపిక, పంపిణీపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం

  • ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ
  • క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
  • హాజరైన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సీఎస్ నీలం సాహ్నీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇళ్లస్థలాల పంపిణీ కోసం అర్హులను ఎంపిక చేయడంలో పాటించాల్సిన విధివిధానాలపై ఆయన వారితో చర్చించారు. జిల్లాల్లో అర్హుల గుర్తింపులో ఎలాంటి అవకతవకలు ఉండరాదని, ముందు పేర్కొన్న సమయంలోనే ఇళ్ల స్థలాల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉగాది రోజున పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News