లాఠీలతో ఉద్యమాన్ని ఆపలేరు జగన్ గారూ!: ట్విట్టర్ లో లోకేశ్

26-12-2019 Thu 13:07
  • రైతులకు సంఘీభావం తెలపడం మీ దృష్టిలో నేరమా?
  • నాయకులను ఎందుకు అరెస్టు చేస్తున్నట్టు 
  • ఎంతమందిని గృహనిర్బంధం చేస్తారు?

రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ఇస్తే మీ దృష్టిలో అది నేరమా? అని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతి పరిరక్షణకు రైతులు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేపట్టిన ఈ ధర్నాకు రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం  చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా లోకేశ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు, లాఠీలతో ఉద్యమాలను ఆపాలనుకోవడం అవివేకమని అన్నారు. నాయకులను గృహనిర్బంధం ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలా ఎంతమందిని గృహనిర్బంధం చేస్తారని అన్నారు.